జనసేన జనబాటకు ప్రజల నుండి అనూహ్య స్పందన

*జనసేన జనబాట రెండవ రోజు అద్భుతంగా జరిగింది

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం ముక్కొల్లు దళితవాడ, నాగారం గ్రామంలో జనసేన జనబాట కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు రెండవ రోజు అద్భుతంగా నిర్వహించడం జరిగింది.

నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేస్తూ.. స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను రూపొందించడం. ప్రజా మద్దతు కూడగట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

రెండవ రోజు జనబాట కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన చాలా అద్భుతంగా ఉంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముక్కొల్లు దళితవాడలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి, మహనీయుడు గొప్పతనాన్ని జనసేన నాయకులు కొనియాడారు.

తదుపరి ముక్కొలు దళితవాడలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. తర్వాత నాగారం గ్రామంలో పెద్ద ఎత్తున జనసైనికులు, స్థానిక ప్రజలు జనబాట కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ వి బాబు, బత్తిన హరి రామ్, పండమ్మనేని శ్రీనివాస్, కనపర్తి వెంకన్న, ముద్దునెని రామకృష్ణ, కూనసాని నాగబాబు, తిరుమణి రామాంజనేయులు, గరికపాటి ప్రసాద్, పుప్పల సూర్యనారాయణ, పాశం నాగమల్లేశ్వరరావు, శిరం సంతోష్, నవీన్ కృష్ణ, యలవర్తి ఆంజనేయులు, జోగి రవీంద్ర, గల్లా హరీష్, జి నాగ, వుసా వెంకయ్య, ముచ్చర్ల సురేష్, జన్యువుల నాగబాబు, సమ్మెట చిన్ని, సమ్మెట చంద్రశేఖర్, సమ్మెట కాశీ, పినిశెట్టి రాజు, ఎర్రంశెట్టి సాయి, కొటారి మల్ల, అబ్దుల్ మజీద్, సమ్మెట గణపతి, సమ్మెట శివ, మహంకాళి రావు, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.