చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే మానవ మడగడ అసాధ్యం

కొల్లేరు నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి

ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దెందులూరు నియోజకవర్గం, ఏలూరు మండలంలోని ప్రత్తికోళ్లలంక, గుడివాకలంక గ్రామాల్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొల్లేరు నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరాన్ లోని రాంసర్ లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఈ సదస్సులో భాగంగా 2003లో కొల్లేరుని కూడా చిత్తడి నేలలు గా గుర్తించడం జరిగిందని అన్నారు.చిత్తడి నేలలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని,చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే మానవ మనుగడ అసాధ్యమని, చిత్తడి నేలలుయొక్క ప్రాధాన్యతను,వాటి పరిరక్షణ, అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కర్తవ్యం గురించి ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించి తద్వారా తల్లిదండ్రులకు అలాగే సమాజానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కొల్లేరు ప్రాంతంలో ఉన్న పాఠశాలలోని విద్యార్థులకు కల్పించడం జరిగిందని తెలిపారు.