ఘనంగా ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

పాలకొల్లు: సామాజిక వేత్త, అంబేద్కర్ సాహితి వేదిక రాష్ట్ర కార్యదర్శి, జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పుట్టినరోజు సందర్బంగా పాలకొల్లు శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ జనసేన శ్రేణులు ప్రేమ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా రామా నాయుడు మాట్లాడుతూ.. ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పార్టీ కార్యక్రమాలతో పాటు లవ్ పీపుల్ ఫౌండేషన్ అనే సంస్థ ను స్థాపించి గత 13 ఏళ్లుగా అనేకమంది అభాగ్యులకు సేవలు అందిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.