నిర్వాసితులకు న్యాయం చేయాలని నిరాహార దీక్ష

అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలం అయిన దేవిపట్నం (నాన్ ట్రైబ్) గిరిజనేతరులకు గోకవరం మండలం గంగాలమ్మ గుడి దగ్గర పునరావాసం నిర్మాణంలో అవకతవకలు ఉన్నా పూర్తి స్థాయిలో అధికారులు కానీ, నాయకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని సబ్ కలెక్టర్ దగ్గర్నుంచి స్పెషల్ కమీషనర్ వరకు ఎవ్వరి దగ్గరకు వెళ్లినా సమాధానం లేదని, మొన్న పడ్డ వర్షాలకు వర్షం నీరు వరదల పునరావాసన్ని ముంచెత్తటం సరైన ప్రణాళికలు లేకపోవటం దీనికి ప్రధాన కారణం అని తెలియచేశారు. గ్రామాలు ఖాళీ చేసి సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నేటికి పునరావాసం పూర్తి చేయలేకపోయారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి నేటికి అందించలేకపోవటం అటు అధికారులు ఇటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలకోసం 2013 భూసేకరణ అమలు చేస్తాం, గ్రామాలు ఖాళీ చేసే నాటికి ప్రతి ఒక్క 18 సంవత్సరాల యువతి యువకులకు నష్టపరిహారం ఆరు లక్షల ప్యాకేజీని 10లక్షలు, అలానే రైతులకు లక్ష నుంచి రెండు లక్షలు తీసుకున్న వారికి ఐదు లక్షలు రూపాయలు ఇస్తామని మాట తప్పం మడం తిప్ప అన్న నాయకుడు ఆ హామీలకోసం నోరు విప్పని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదిహేనువేల కుటుంబాలను నట్టేట ముంచేసారని నిర్వాసితులకు న్యాయం చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న నిర్వాసితులకు మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, నియోజకవర్గ నాయకులు టీడీపీ నాయకులు పాల్గొనగా రంపచోడవరం సీనియర్ నాయకులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కాకి స్వామి అన్న, దేవిపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకట రాయుడు, రాగల సురేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుంజం శ్రీను, గంగవరం మండల అధ్యక్షుడు కుంజం సిద్దు, సీనియర్ నాయకులు సాదల సన్యాసిరెడ్డి, కొమరం దొరబాబు, వీరవల్లి పోసిబాబు, తుర్రం శ్రీనివాస్ మొదలైన వారు పాల్గొన్నారు.