జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: బత్తుల

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ దంపతులు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజాసేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్న మన అభిమాన నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ దిగ్విజయంగా 9 వసంతాలు పూర్తిచేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వ్యవస్థాపకులు శ్రీ పవన్ కళ్యాణ్ గార్కి రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలందరికీ, ప్రజలందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక శుభాభినందనలు అని తెలిపారు.