బాబుతో నేను కార్యక్రమానికి జనసేన మద్దతు

తుని: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ చంద్రబాబు త్వరగా విడుదలై బయటికి రావాలని డిమాండ్ చేస్తూ శృంగవృక్షం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలో తుని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు జనసేన జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష శిబిరం నుంచి పాదయాత్రగా రోడ్డు మీద షాప్ లకు, ప్రజలకు బాబుని ఏ విధంగా తప్పుడు కేసులో ఇరికించారో, ఏ విధంగా అరెస్ట్ చేసారో ప్రజలకు వివరించి బాబుతో నేను కర పత్రాలను పంచిపెట్టారు. అనంతరం డా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు, శృంగవృక్షం గ్రామ అధ్యక్షుడు సుంకర చక్రవర్తి, మండల కార్యవర్గ సభ్యులు మరియు మండల మరియు శృంగవృక్షం గ్రామ జనసైనికులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.