భాజపా ఇచ్చే వ్యాక్సిన్‌ను నమ్మేది లేదు తీసుకొనేది లేదు.. అఖిలేశ్‌

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీని కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు.. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కొవిడ్‌-19 టీకాను తాను తీసుకోబోనని చెప్పారు. అది భాజపా వ్యాక్సిన్‌ అని, దాన్ని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. అలాంటి వ్యాక్సిన్‌ తీసుకోబోనని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతీ ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీచేయనున్నట్టు ప్రకటించారు అఖిలేష్.. బీజేపీ వ్యాక్సిన్‌ను మాత్రం నమ్మేది లేదు తీసుకొనేది లేదని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో యూపీలో ఎస్పీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత.. అఖిలేష్‌ యాదవ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌పై ఇప్పుడు అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *