నేనే గెలిచా: ట్రంప్

ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఇంకా నేనే గెలిచానని మాట్లాడుతున్నారు డోనాల్డ్ ట్రంప్. ఐ వన్ ది ఎలక్షన్ అంటూ ట్వీట్ చేసి అభాసుపాలవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న డోనాల్డ్ ట్రంప్..ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించేది లేదంటున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మరింతగా అభాసుపాలు చేస్తున్నాయి. జో బిడెన్ గెల్చినట్టు అంగీకరిస్తూనే..మరోవైపు అధ్యక్ష పీఠం కోసం మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ..నేనే గెలిచానంటూ ట్వీట్ చేయడం ఇందుకు నిదర్శనం. ట్రంప్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అటు ట్విట్టర్ కూడా ట్రంప్ ట్వీట్ ను ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట కింద ఓ హెచ్చరిక కూడా జారీ చేసింది.