డిగ్రీ కళాశాల కోసం ఇచ్చాపురం జనసేన నిరాహారదీక్ష

ఇచ్చాపురం, కవిటిలో డిగ్రీ కాలేజ్ ప్రపోజల్ 2011లో పెట్టడం జరిగింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న తరువాత ప్రత్యేక ఆంధ్రగా మారిన తరువాత 2014లో ఎన్నికల హామీగా చెప్పారు. అలాగే 2019 లో కూడా ఎన్నికల హామీ ఇచ్చారు. పాపం పాలకులు మర్చిపోయారు. డిగ్రీ కాలేజ్ ఆవశ్యకత తీర ప్రాంతం, అత్యధిక మత్స్యకార గ్రామాలు, సామంత గ్రామాలు, 95% వెనుకబడిన తరగతికి చెందిన వారు ఉండటం వలన ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మండల కేంద్రంలో ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, 3 ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లు అందులోనే 2 ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లు ఉన్నాయి. ఒక మోడల్ స్కూల్ ఇంత పొటెన్షియల్ ఉన్న ప్రాంతాల్లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఏంటి. కాగితాలకే పరిమితం ఎందుకు అవుతుంది. ఇక్కడ నుండి సుమారు 10 తొ 15 క్మ్ దూరం ప్రయాణించి బారువ, ఇచ్చాపురం వెళ్తున్నారు. ఎందుకు ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో ఏ మండలంలో ఇన్ని కాలేజ్ లు లేవు. ప్రత్యేకంగా మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితుల్లో డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలేదు. ఇంకొక దురదృష్టకర విషయం ఏమిటంటే సుమారు 40 సంవత్సరాల చరిత్ర కలిగిన జూనియర్ కాలేజ్ లో పూర్తిస్థాయిలో సిబ్బంది, అధ్యాపకులు లేరు. ప్రయోగశాలలు లేవు, భవనాలు లేవు. అమ్మాయిలకు మరుగుదొడ్లు కూడా పూర్తి స్థాయిలో లేవు. ఉన్నవి పరిశుభ్రంగా కూడా లేవు. విద్యార్థులు తమ చదువులు కొనసాగించడంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ఉన్నత విద్యను చాలా మంది విద్యార్ధులు కోల్పోయారు. అందుకే భావితరాలకు అయిన ఉన్నత విద్య అందించాలంటే కవిటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరం. అందుకే డా.సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. డిగ్రీ కళాశాల కోసం అడుగులు పడని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంకా బలమైన పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బెైపల్లి ఈశ్వర్ రావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మండల అధ్యక్షురాలు శ్రీమతి దుర్గాసి నీలవేణి, కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి శారద ఈశ్వర్, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10వ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, 22 వ వార్డ్ ఇంఛార్జి దాసరి శేఖర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, ఎంపీటీసీ అభ్యర్థి గుల్ల కుర్మారవు, వీరమహిళ శైలజ, తిప్పన సురేష్, క్రాంతి, చందు, బీన ప్రదీప్, రాజశేఖర్, హేమా చలపతి, నర్తు ఈశ్వర్, కృష్ణ, బడే దేవరాజు, బడగల రామకృష్ణ, ధనుంజయం, జగన్నాథం, జయకృష్ణ, మన్మధ, జగదీష్, చలపతి, వాసుదేవ్, మోహన్, దవల రాజు, హేమసుందర్, కామేష్, శంకర్, సంతోష్, శివ, ఉదయ్, ప్రతాప్, దేవ, చలపతి, కవి, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.