లొద్ద పుట్టుగలో భగత్ సింగ్ కు నివాళులర్పించిన ఇచ్చాపురం జనసేన

ఇచ్చాపురం, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని యువత గుండెల్లో రగిలించిన విప్లవ వీరుడు 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త దాసరి రాజు లొద్ద పుట్టుగలో ప్రతిష్టించిన భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పిస్తూ చిన్న వయసులోనే మనదేశం బానిస సంకెల నుండి విముక్తికై తన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా విడిచిపెట్టిన భగత్ సింగ్ లాంటి వ్యక్తులును మనము స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రేమగా పెంచిన కుక్కను మన ఒడిలో కూర్చోబెట్టుకుంటాం కానీ, ఈ సమాజంలో మనుషుల్ని మాత్రం అంటరానితనం పేరుతో ఒకరినొకరు వేరు చేసుకుంటున్నామని ఆ రోజుల్లోనే భగత్ సింగ్ అన్నారు. అంటరానితనాన్ని విడనాడాలని దాసరి రాజు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, మరియు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఇచ్ఛాపురం, మున్సిపాలిటీ 9, 11 వార్డు ఇంఛార్జిలు, సంతోష్, కళియా మహారాన, దుంగు భాస్కర్ రెడ్డి, డిల్లేష్, తిప్పన సురేష్ దాసరి శేఖర్, మాధవ్, అజయ్, కామేష్, మోహన్, రాజు బెహరా తదితరులు పాల్గొన్నారు.