ఆదర్శ భారత్.. రిషికేష్ లో ప్రధాని మోడీ

కరోనాను కట్టడి విషయంలో ఎంతో ఆదర్శంగా పని చేశామన్నారు ప్రధాని మోడీ. చాలా తక్కువ సమయంలోనే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఉత్తరాఖండ్ రిషికేష్ లో ఆక్సిజన్‌ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు మోడీ. పీఎం కేర్స్‌ తో నిర్మించిన 35 పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ ను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అంకితం చేసినట్లు వివరించారు.

కేవలం ఒకే టెస్టింగ్‌ ల్యాబ్‌ నుంచి 3వేలకు ఆ సంఖ్యను పెంచినట్లు చెప్పారు మోడీ. మాస్కులు, పీపీఈ కిట్స్‌ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి.. ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని వివరించారు. ఇక వ్యాక్సినేసన్ గురించి చెబుతూ.. యావత్‌ ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు మోడీ. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు.

20 ఏళ్ల క్రితం తన ప్రజా జీవన ప్రయాణం మొదలైందన్న మోడీ… ఏనాడూ ప్రధాని అవుతానని ఊహించలేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 13 ఏళ్లు సీఎంగా.. ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికయ్యానని చెప్పారు.