సి.బి.ఐ దత్తపుత్రుడా అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే.. సరైన గుణపాఠం చెబుతాం: మాకినీడి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజవర్గం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి శేషుకుమారి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సి.బి. ఐ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, అన్ని విధాల ప్రాజలను బాదుడికి గురిచేసిన సీఎం, మా అధినేత పై బురద జల్లే ప్రయత్నం మానుకొకపోతే జనసేన సరైన గుణపాఠం చెబుతుందని.. అభివృద్ధి మరచి అవమాన మాటలతో కాలం వెల్లబుచ్చుతున్నారని.. అభివృద్ధి వైపు నడిపించక పోగా.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు.. జైలు రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ తండ్రిని చూసి ఓటు వేసి గెలిపించారు.. కానీ మీరు చేసింది ప్రజలకు ఏమీ లేదు. మీ ఎమ్మెల్యేలతో గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు. కానీ మీ కార్యకర్తలు గడపలు దగ్గరికి కాదు సామాన్య ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగే ధైర్యం లేదు మీకు.. రాష్ట్రమంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు.. ఆయన కౌలు రైతులకు భరోసాగా చేపట్టిన కార్యక్రమం ఒక రైతన్న కుటుంబానికి అండగా జనసేనాని భరోసా కల్పిస్తూ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేయలేని పని మా అధినేత 30 కోట్లతో సొంత కష్ట జీతంతో తోచిన సాయం చేసి.. వారికి అండగా నిలిచిన ఏకైక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మా నాయకుని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఖబడ్దార్ అన్ని ఆమె అన్నారు.