గిరిజన చట్టలకు తూట్లు పొడిచేందుకే కుంభ రవి బాబుకు ఎమ్మెల్సీ పదవి

అనంతగిరి: బ్రిటిష్ కాలం నుండి తరతరాలుగా వ్యవసాయం చేసి బ్రతికే భూములను ఎస్.టి చెర్మెన్ రవిబాబు సర్వనాశనం చేస్తున్నారని నిమ్మలపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ అనంతగిరి జనసేనకు ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వాళ్లసి పంచాయతీ నిమ్మలపాడు కరకవలస రాళ్ల గరువు వ్యవసాయ భూములను ఏపీఎండీసీ అధీనంలో వెళ్లడానికి రవిబాబు ఏ కారణము అని గ్రామస్తులు వారిపై తీవ్రంగా విమర్శిస్తున్నారు రవిబాబు ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఏపీఎండిసి ద్వారా మైనింగ్ టెండర్ రావడం జరిగింది. అంతకు ముందు సమతా జడ్జిమెంట్ వచ్చినప్పుడు నుండి మైనింగ్ కార్యకలపలు మా నిమ్మలపాడు గ్రామస్తులకు తెలిసేవే కావు తన రాజకీయం స్వార్థం గురించి నిమ్మలపాడు గ్రామ భూములు నావే అని చెప్పుకుంటూ మైనింగ్ ప్రారంభించడానికి పునాది వేసి ఉన్నారు. నిమ్మలపాడు గ్రామస్తులు ఎన్నిసార్లు ప్రశ్నించినా నాకు వాటి విలువలు తెలియవు అని వారి బినామీలు ద్వారా టెండర్లు తెచ్చుకుంటూనాడు. ఆదివాసి అమాయక గిరిజనులకు తెలియకుండానే రాజధానిలో కూర్చుని మైనింగ్ టెండర్ వ్యవహారం సాగిస్తున్నారు. ఈ విధముగా మా భూములు సర్వనాశనం చేసి జీవితాలను సర్వనాశనం చేసేడు ఇప్పుడు విషయాలు అడిగితే ఫోన్ కూడా ఎత్తడం లేదు. నిమ్మలపాడు రాళ్లగరువు కరకవలస గ్రామస్తులు రవిబాబు మీద ఆవేదన వ్యక్తం చేశారు. మరియు గిరిజన చట్టలకు తూట్లు పొడిచినందుకే ఎమ్మెల్సీగా కుంభ రవి బాబుకు పదవి జనసేన మురళి ఆరోపణ చేసారు. ఈ విషయంపై చిట్టం నాయక్ మురళి జనసేన అధ్యక్షులు మాట్లాడుతూ వాలసి పంచాయతీ నిమ్మళపాడు కాలసైట్ మైనింగ్ విషయంలో గిరిజనులకు. గుండెకాయ అయినా పిసా చాట్టానికి. 1/70 చట్టానికి తూట్లు పొడిచిన కుంభ రవిబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు అంటే ఈ ప్రభుత్వానికి గిరిజనుల మీద గిరిజన చట్టాల మీద ఎంత గౌరవం ఉందో గిరిజనుల ఆరోగ్యాల మీద ప్రేమ ఉందో రవిబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా వైసీపీ ప్రభుత్వం యొక్క సౌటి తల్లీ ప్రేమ తేటతెలమైనది రవిబాబు అన్న వ్యక్తి గిరిజనుల మీద గాని గిరిజన చట్టాలను నిర్వీర్యం చేయడంలో అపర మేధావి గలిగిన వ్యక్తి అనంతగిరి మండలం బొర్రా పంచాయితీ డేక్కాపురం గ్రామము కాల్ సైట్ మైనింగ్ విషయములో అలాగే నిమ్మలపాడు కాల్ సైట్ మైనింగ్ విషయంలో ఆయన వ్యవహరించిన శైలి గిరిజన చట్టాలను నిర్వీర్యం చేసి మైనింగ్ ను ఈ వైసీపీ పార్టీ పెద్దలకు అయినా వారికి ముఖ్యమంత్రికి దోసి పెట్టడంలో సక్సెస్ అయినందుకు ఆయనకు ఉత్తరాంధ్రలో ఉన్న ఐదో షెడ్డు ప్రాంతంలో ఉన్న నాయకులకు ఈ వైసీపీ ప్రభుత్వం గుర్తించకుండా గిరిజన చట్టాలను నాశనం చేసి అటవీ సంపాదన ఖనిజ సంపాదన దోసుకొని పోవడానికి ఎమ్మెల్సీ పదవిని ఈ ప్రభుత్వం కట్టబెట్టింది తప్ప నిజంగా గిరిజనులకు న్యాయం చేయడం కాదు అని ఈయనకు పదవి ఇవ్వడం బట్టి తేటతెర్లమైంది ఈయన రెడ్లకు కార్పొరేట్ కంపెనీలకు గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోసి పెట్టడానికి గిరిజన చట్టాలను అధికారుల మీద ఒత్తిడి తెచ్చి నిర్వియం చేయడంలో చాలా తెలివిగలిగినవాడు అమాయక గిరిజనులను డబ్బు ఎరచూపి పదవితో బెదిరించి పర్చూకోడంలో దిట్టైన వ్యక్తి గిరిజన యువతులు మేలుకో పోతే అనంతగిరి మండలం లో ఉన్న అపార ఖనిజ సంపదను భూములను సర్వనాశనమై ప్రమాదము ఉన్నది ఈయన ఎస్.టి కమిషన్ చైర్మన్ పదవిలో ఉండగానే ఉన్న గిరిజన భూములు అన్యాయ క్రాంతి మై ఉన్న గిరిజన భూములపై ఎటువంటి చర్య కూడా తీసుకోలేపోయారు అని జనసేన మురళి విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కేరంగి ధర్మన్న మాజీ సర్పంచ్ లచ్చన్న వార్డ్ నెంబర్ జన్ని పండన్న సోమన్న వెంకట్రావు బాలరాజు పండన్న అప్పన్న లచ్చన్న పాల్గొన్నారు.