ఒకతరం మంచిది అయితే అందులో నుంచి వచ్చే నాయకుడు దేశ దిశను మార్చగలుగుతాడు

*ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాన్ పోస్ట్ చూసినా వర్షం కురిసినట్టు హామీలు అన్నిటికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఆ డబ్బు ఎక్కడ నుంచి తెగలరు అనే ఆలోచన ఒక్కసారి అయినా చేశారా??

*దేశంలో ఉన్న వనరులను ఉపయోగించి వనరులను సృష్టిస్తాను, విదేశీ ఎగుమతులు పెంచుతాను, నదులు అనుసంధానం చేస్తాను , కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చెప్పాడతాను, విద్యా ప్రమాణాలలో 2 వతరగతి నుంచే డిజిటల్ విద్యను తీసుకొస్తాను, వ్యవసాయం లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తీసుకువస్తాను, పేపర్ లేని పెన్ను పట్టని వ్యవస్థను తీసుకువస్తాను, పోలీసు తప్పుడు కేసులను, పెండింగ్ లో పేరుకు పోయి ఉన్న కేసులను వెంటనే పరిష్కరిస్తాను, సముద్రాల ద్వారా ప్రపంచ వర్తక వాణిజ్యం నడుపుతాను అని, జపాన్, చైనా, సింగపూర్ లకు దీటుగా షిప్పింగ్ పోర్టులను దేశం అంతా ఏర్పాటు చేస్తాను అని.. ఇలా ఎన్నో కొన్ని వేల హామీలు ఉన్నాయి.

*కాదు… కాదు..చెల్లికి రెండు వేలు, అక్కకు 3 వేలు, అన్నకు4 వేలు, అమ్మకి 10 వేలు, నాన్నకు 20 వేలు, ఇలా దిక్కుమాలిన పథకాలు పెట్టి సంపద అంతా ఫలహారం లా పంచి పెట్టి, అప్పులు కుప్పలుగా పెంచి, సరైన వైద్యం, విద్య, రోడ్లు లేక, వరదలు, తుపానులు, అమాయకుల మీద తప్పుడు కేసులు, నేరం చేసిన వాడికి పోలీసులు సలాం చేస్తూ, ముందు చూపు లేని పాలన, అభివృద్ధి లేకుండా అప్పులు మిగిల్చి , తమకు అయిన వారికి కాంట్రాక్టులు దానిలో కమిషన్లు ఇలా చేస్తే వాడే ఈ రాష్ట్రానికి మంత్రో, సీఎం కావచ్చు.

*ఓక తరం మార్పు కోరుకుని నీతి నిజాయితీగా పార్టీ ఇచ్చిన హామీలు దేశ భవిష్యత్తు కు ఉపయోగ పడతాయా లేదా ఒక్క టి గమనించి రూపాయి లంచం లేకుండా ఆలోచించి ఓటు వేయండి. అప్పుడు మనలో ఒకడు నాయకుడు పుడతాడు దేశాన్ని మారుస్తాడు.
*వైద్యం కోసం తెలియని వాడు వైద్య శాఖ మంత్రి, నదులు కోసం తెలియని వాడు నీటి పారుదల శాఖ మంత్రి ఇలా కనీసం శాఖ ను వాడికి అవగాహన ఉండకుండా ఆయన మంత్రి అవ్వడం కనీసం చిన్న అటెండర్ ఉద్యోగానికి వంద టెస్టులు కానీ ఒక శాఖను నడిపే మంత్రికి 3 నెలలు పాటు అయినా శిక్షణా తరగతులు ఉండవు
*సామాన్యులకు ఈదేశంలో న్యాయం జరగాలి ప్రపంచ దేశాలకు భారత దేశం ఒక ఆదర్శంగా నిలవాలి అంటే నోటు లేని ఓటును చూడాలి. ఉచితాను ఉచితాలు తో దేశ సంపదను ఫలహారం చేస్తున్న నాయకులుకు పాడే కట్టాలి. హామీలు కన్నా అభివృద్ధి చూడండి.
*మీ పిల్లలకు చెప్పండి నువ్వు పోలీసో, ఇంజినీరో, డాక్టర్ కాదు అవ్వాల్సింది. ఓటుకు నోటు తీసుకోకుండా నిజాయితీగా గల ఓటరుగా మారు అని ఒక తరం మార్పు తో అయినా దేశం బాగుంటుందని ఆశిస్తున్నాని కోటిపల్లి అయ్యప్ప.. తెలియజేసారు.