ఈ రాష్ట్రానికి పోలవరం జీవ నాడి ఐతే.. రైల్వే జోన్ ప్రాణ వాయువు

  • జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త లు నాగలక్ష్మి కిరణ్ ప్రసాద్, త్రివేణి

ఉత్తరాంధ్ర: జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త లు నాగలక్ష్మి కిరణ్ ప్రసాద్, త్రివేణి ఆదివారం మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి పోలవరం జీవ నాడి ఐతే.. రైల్వే జోన్ ప్రాణ వాయువు లాంటిది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడం వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్దికి మొదటి మెట్టు అని పేర్కొన్నారు. ఒక ప్రాంతం అభివృధి అవ్వాలి అంటే రవాణా వ్యవస్థలు బాగుండాలి. అందులో రైల్వే వ్యవస్థ మెరుగుగా ఉంటే అందరికీ ఉపయోగం ఉంటుంది. రైల్వే జోన్ వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులు రవాణా మరింత సులువు అవుతుంది. మన ప్రాంత రైల్వే నిర్ణయాలు మనమే తీసుకొవచ్చు. ఏటా 4వేల కోట్లు ఒక్క కార్గో తో ఆదాయం ఈస్తున్న ప్రాంతం విశాఖ. విశాఖ పేరు పెట్టిన రైల్ విశాఖలో ఉండదు. ఒకప్పుడు ఇక్కడ నుంచి బయలు దేరే రైలు ఇప్పుడు భువనేశ్వర్ నుంచి వస్తునాయి. ఈ ప్రాంత వాసులకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకవు. కనీసం ఇంటర్ కనెక్ట్ ప్యాసింజర్ రైళ్ల లేవు. వీటి అన్నింటికీ ఒకటే పరిష్కారం రైల్వే జోన్ ప్రక్రియ మొదలు కావడం. నాకు ఎంపిలు ఇస్తే భూగోళం తిప్పెస్తా అన్నారు సీఎం జగన్ మోహన్రెరెడ్డి.. 31 మంది రాజ్యసభ లోక్ సభ ఎంపి లను ఇస్తే ఏం చేశారు??. కనీసం జోన్ కోసం, కార్యాలయం కోసం 53 ఏకరాల స్థలం అడిగితే ఇవ్వలేదని రైల్వే మంత్రి స్వయంగా చెప్పారు. రుషికొండ ప్యాలస్ కి స్థలం ఉంది, ప్రతి జిల్లా లో వైసీపి పార్టీ కట్టుకోవడానికి స్థలం ఉంది. రైల్వే జోన్ కోసం ఇవ్వడానికి స్థలం లేదా.. నాల్గున్నార ఏళ్ళు పట్టిందా. కనీసం ఒక్క సారైనా ఢిల్లీ వెళ్లి నప్పుడు మీ తమ్ముడు అవినాష్ బెయిల్ కోసం కాకుండా రైల్వే జోన్ కోసమో, స్పెషల్ స్టేటస్ కోసమో అడగావా జగన్ మోహన్ రెడ్డి??. పార్లిమెంట్ సమావేశాల్లో వైసీపి మంత్రులు నోరు మెదపుతునారా??. ఎంత సేపు అప్పులు తేవడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప ఏం తెలుసు సీఎం గారు. రైల్వే జోన్ విభజన హామీ కేంద్రం నేరవెరుస్తుంది. మా జనసేన పార్టీ మా అధినాయకుడు అందుకు కృషి చేస్తున్నారు.. చేస్తారు.