రాష్ట్రంలో పనికిమాలిన మంత్రి ఎవరైనా ఉంటే అది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు: పోతిన మహేష్

విజయవాడ, నియోజకవర్గ అభివృద్ధికి మూడు సంవత్సరాలుగా గాలికొదిలేశారని, కేవలం అవినీతి సంపాదనను మాత్రమే ప్రేమించారని,
ఉద్యోగస్తులు లక్షలాదిగా రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని అందువల్లే ప్రభుత్వం ఉద్యోగస్తులతో కాళ్లబేరానికి వచ్చి కొన్ని డిమాండ్లును నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామని పెంచకుండా పిఆర్సి ద్వారా జీతాలు తగ్గించి ప్రభుత్వం మోసం చేయబట్టే ఉద్యోగస్తులు లక్షలాదిగా రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని అందువల్లే ప్రభుత్వం ఉద్యోగస్తులతో కాళ్లబేరానికి వచ్చి కొన్ని డిమాండ్లును నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారుమనసుతో తీసుకున్న నిర్ణయం అయితే లక్షలాది మంది ఉద్యోగస్తులు రోడ్లపైకి వచ్చి ఎందుకు ధర్నా చేశారో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమాధానం చెప్పాలని, మోసంచేసే నిర్ణయం కనుకనే ఉపాధ్యాయ సంఘాలు ఈరోజుకి పిఆర్సి కోసం ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్నారని ముందు ఈ అంశంపై మంత్రి సమాధానం చెప్పాలని, అదేవిధంగా 30 వేల మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే సుమారు 14 వేల కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వఒ పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 పెంచడం వాస్తవం కాదాఅని, ప్రావిడెంట్ ఫండ్స్ మీద లోన్స్ పెట్టుకుంటే ఏడాది కాలంగా 2,400 కోట్లు చెల్లించకుండా వాయిదా వేయడం వాస్తవం కాదా అని, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుల బకాయిలు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించలేని ఈ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వమని, ఉద్యోగస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ స్పందిస్తే మంత్రి శ్రీనివాసరావు మంత్రి పదవీకాలం ముగుస్తున్నందున పవన్ కళ్యాణ్ పై నాలుగు విమర్శలు చేస్తే మరల పదవి వస్తుందని అపోహతో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ఈ రాష్ట్రంలో పనికిమాలిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎందుకంటే ఆయన దేవాదాయశాఖ మంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి 150కి పైగా దేవాలయాల్లో దేవతామూర్తులను పాక్షికంగా ధ్వంసం చేశారని, రథాలను తగలబెట్టారని, మూడు సింహాలు దొంగిలించారని ఆయన ఒక్కటంటే ఒక్క కేసు కూడా చేదించలేని ఈ మంత్రి పనికిమాలిన మంత్రి కాకపోతే మరి ఏంటని ప్రశ్నించారు, నియోజకవర్గ అభివృద్ధికి మూడు సంవత్సరాలుగా గాలికొదిలేశారని కేవలం అవినీతి సంపాదన మాత్రమే ప్రేమించారని అందుకే నియోజకవర్గ ప్రజలు మంత్రిని ప్రశ్నిస్తున్నారని, నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టి నగర్ వరకు ప్రధాన రహదారి కూడా నిర్మించలేక పోయారని, ముసఫిర్ఖాను గాలికి వదిలేశారని, అమ్మవారి దేవాలయ అభివృద్ధికి 70 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామని అబద్ధపు ప్రకటనలు జారీ చేస్తూ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అమ్మవారి ఆలయ ఖాతాకు జమ చేయలేకపోయారని, రేషన్ కార్డులు పెన్షన్లు రద్దు చేసినందుకా, లేక పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపేందుకా లేక నాలుగు సంవత్సరాల క్రితం టిడ్కో ఇళ్ల కోసం చెల్లించిన సామాన్యులకు ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించనందుకు మిమ్మల్ని మంత్రి పనికొచ్చే మంత్రి అంటారా లేఖ పనికిమాలిన మంత్రి అంటారో మీరే సమాధానం చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో మంత్రిగా పని చేసిన శ్రీనివాస్ కి ప్రజల డిపాజిట్లు కూడా దక్కనియకుండా బుద్ధి చెబుతారన్నారు.