మహిళా సాధికారత కు కృషి చేస్తే రూ.14 కోట్లిస్తాం: గూగుల్

న్యూఢిల్లీ: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు 2.5 కోట్ల డాలర్లు (రూ.183 కోట్లు) ఆర్థిక సహాయం అందజేస్తామని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రకటించింది. లాభాపేక్ష లేని ఏ సామాజిక సంస్థ అయినా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపికైన ఒక్కో సంస్థకు 20 లక్షల డాలర్ల (రూ.14.67 కోట్లు) వరకు అందజేస్తామని గూగుల్‌.ఆర్గ్‌ ప్రెసిడెంట్‌, గూగుల్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ జాక్విలిన్‌ ఫుల్లెర్‌ తెలిపారు.