ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే పవన్ ముఖ్యమంత్రి కావాలి
రాజంపేట, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని రాజంపేట నియోజకవర్గ జనసేన యువ నాయకుడు అతికారి దినేష్ పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం యువగర్జన సంఘీభావ దీక్షను నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన యువనాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యువగర్జన దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు వీర మహిళలతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని యువతి యువకులు ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసలుగా వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారని ఆయనకు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో టిడిపితో కలిసి రాష్ట్రంలో అధికారం చేపట్టి వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-14.18.37-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-14.18.38-1024x768.jpeg)