ముప్పాళ్ళ జనసేన ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ మండలం, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శనివారం ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముప్పాళ్ళ మండలం స్థాయిలో 1000 మంది ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొర్రా వెంకట అప్పారావు పాల్గొని మసీదులోని ముస్లిం పెద్దల సమక్షంలో ప్రార్థనలో పాల్గొని అనంతరం ప్రజలతో మమేకమై ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.