జనసేన – తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వ సంకల్ప పాదయాత్రలో బొర్రా అక్రమ అరెస్టు

సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం గర్నేపూడిలో జనసేన నియోజకవర్గ నాయకులు బొర్రా అప్పారావు నాయకత్వంలో జనసేన-తెలుగు దేశం సంకీర్ణ ప్రభుత్వ సంకల్ప పాద యాత్ర చేపట్టింది. ఈ యాత్రను జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, మాజీ మంత్రి సత్తెనపల్లి టిడిపి ఇంఛార్జి కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నరు. డిఎస్పీ నుండి మౌఖికంగా పర్మిషన్ తీసుకున్నాను అని జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు అన్నారు. ఈ క్రమంలో గర్నేపుడిలో హైడ్రామా నెలకొంది. జనసేన – పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. బొర్రా అరెస్టును నిరసిస్తూ జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై కూర్చున్నారు. గర్నేపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తరువాత బొర్రా వెంకట అప్పారావును పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు ప్రచార రథాన్ని, కర్వన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత పెదమక్కేనలోనే పర్మిషన్ వచ్చేవరకు ఉంటానని బొర్రా వెంకట అప్పరావు తెలిపారు. అనుమతి వచ్చాక తిరిగి పాదయాత్ర ఇక్కడి నుండే ప్రారంభిస్తానన్నారు. ఈ సంఘటనతో పాదయాత్ర నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజని, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టీ సాంబశివరావు, జిల్లా కార్యదర్శి నిశ్శంకు శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు సత్తెనపల్లి నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం తోట నరసయ్య, ముప్పాళ్ళ సిరిగిరి పవన్ కుమర్, నకరికల్లు తాడువాయి లక్ష్మి, రంగిసెట్టీ సుమన్ కుమార్, తెదేపా మండల అధ్యక్షుడు ఆళ్ల అమరేశ్వరరావు, నేతలు కోమటినేని శ్రీనివాసరావు, మక్కపాటి రామచంద్రరావు, కోయా లక్ష్మయ్య, యర్రా వెంకటేశ్వరరావు, మండదపు సాంబయ్య, పుట్టి హనుమంతరావు, గద్దె అప్పారావు, కేశవ తదితర జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.