గుంతకల్లులో జనసేన నాయకుల అక్రమ అరెస్టు

గుంతకల్లు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విజయవాడ రాకుండా మధ్య మార్గంలోనే అక్రమ నిర్భందన చేసినందుకు గాను, ఈ ఘటనను వ్యతిరేకిస్తూ గుంతకల్లు టౌన్ లోని స్థానిక ఎన్.టి.ఆర్ సర్కిల్ మెయిన్ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, గుంతకల్లు మండల అధ్యక్షులు పురుషోత్తం, మారుతి కుమార్, విరేష్ కుమార్, హెన్రీ పాల్, విజయ్ కుమార్, గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు జీలాన్ బాషా, మహేష్, మహేష్ గుప్తా, అరవింద్, ప్రకాష్, మహీంద్ర, రాకేశ్, అరవింద్ సాగర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.