గ్రావెల్ అక్రమ తవ్వకాలపై పారదర్శకంగా విచారణ జరపాలి

కోవూరు నియోజకవర్గం: అక్రమార్జనకు కాదేది అనర్హం అంటూ వైసీపీ ప్రభుత్వం ఇసుక, మట్టి, గ్రావెల్ సహజ వనరులను దోచుకుంటూనే ఉన్నారు. కే.జి.ఎఫ్ కోవూరు గ్రావెల్ ఫ్యాక్షన్ అరికట్టాలి.. గ్రావెల్ అక్రమ తవ్వకాలు సర్వే నెంబర్ 920 లోకాయుక్త అధికారులు పారదర్శకంగా విచారణ జరపాలి అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి కనిగిరి రిజర్వాయర్ వద్ద నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహజ సిద్ధంగా ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ కట్టను దోచుకోవడం వల్ల రేపు వరదలు వస్తే చుట్టు పక్క గ్రామాలు మునిగి పోతాయి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతుంది. గతంలో ఉన్న కలెక్టర్ కూడా సర్వే జరిపారు,నివేదిక ఏమైందో ఇప్పటివరకు తేలలేదు. ప్రస్తుతం లోకాయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే పారదర్శకంగా జరగాలి అధికారులు కఠినంగా వ్యవహరించి 40 అడుగుల లోతు 40 ఎకరాల గ్రావెల్ తవ్విన అక్రమార్కులను బయటపెట్టాలి. కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్న భూములను పూర్వం పేదలు ఒక ఎకరా, అరెకరా పండించుకుని వచ్చింది ఏదో తింటూ కాలం గడుపుతుండేవారు. పెత్తందారులు ఇరిగేషన్ స్థలాలు చేజిక్కించుకొని కొన్నట్టుగా బయట ప్రజలు ప్రచారం చేసుకుని, వాటిపై పొలాలు చేపల చెరువులు వేసుకొని సంపాదించుకున్నారు. అందుకే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్నకి పేదలకు క్లాస్ వారు నడుస్తుందని పదేపదే తెలుపుతున్నాము, పేదలు పేదలు సంపాదించుకునే రూపాయిని కూడా వారికి అందకుండా చేస్తుంది. నాలుగు సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అండదండలు చూసుకుని యధేచ్ఛగా గ్రావెల్ తవ్వడం ప్రారంభించి కొండలను గోతులుగా తయారు చేశారు. అక్రమార్చిన ధ్యేయంగా ఇష్టారాజ్యాంగా కోవూరు నియోజకవర్గంలో రోడ్లు నాశనం అవుతున్నా నిరాటంకంగా అక్రమ వవాణా జరుగుతుంది. ఎవరైనా ఎదురిస్తే అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయి. జనసేన పార్టీ తరఫున నేషనల్ ట్రిభ్యునల్ కోర్టుకు ఆశ్రయించాలన్న అనుకున్న తరుణంలో లోకాయుక్త కి ఎవరో పిటిషన్ వేశారు. ఈ సర్వే పారదర్శకంగా జరగాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను, గతంలో కోవూరు నియోజకవర్గంలో ఉన్న అధికారులు అందరికీ ఫిర్యాదులు ఇచ్చినా, ఇప్పటికీ రాత్రిపూట అక్రమంగా రవాణా జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారులు మాత్రం పారదర్శకంగా సర్వే రిపోర్ట్ ఇవ్వాలని లోకాయుక్త అధికారులను సవినయంగా కోరుకుంటున్నాము. ఇప్పటికైనా సహజ వనరుల దోపిడీని అరికట్టి సమాజ శ్రేయస్సును కాంక్షించాలని తెలిపారు. రాబోయే ప్రభుత్వాలు ఏదైనా చేయాలంటే ఈ గుంటలను పూడ్చాలన్నా కాని పనిగా చేసారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ పరిస్థితులను గమనించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో ఉపాధ్యక్షుడు సుధీర్ బద్దెపూడి బుచ్చిమండల నాయకులు షారు, సాయి, కాషిఫ్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ఖలీల్, కేశవ తదితరులు పాల్గొన్నారు.