నెల్లిమర్లలో జోరుగా యువశక్తి ప్రచారం

నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండల హెడ్ క్వార్టర్స్లో యువశక్తి మహాసభ గురించి అవగాహన కల్పిస్తూ స్థానిక డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీల్లో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు జలపారి అప్పడుదొర(శివ) తో పాటు సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, బలభద్రుని జానకీరామ్, మాదేటి ఈశ్వర్రావు, దుక్క అప్పలరాజు, పిన్నింటి అప్పలనాయుడు, అల్లాడ జగదీష్, దేశెట్టి వంశీ, సతీష్, లెంక గణేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.