జనసేన, టి.డి.పి నాయకులతో సమావేశమైన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం: తర్లుపాడు మండలం, సూరేపల్లి గ్రామం నందు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీను, గుండెబొమ్ము శ్రీను, యాదగిరి శివ, గ్రంథే కిషోర్, బాబు, శ్రీకాంత్, ఆదినారాయణ, చలపతి, జనసేన మరియు తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.