దేవి వైష్ణవిని సత్కరించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో ముమ్మిడివరపు సురేష్ బాబు, శ్రీమతి నాగజ్యోతిల కుమార్తె ముమ్మిడివరపు దేవి వైష్ణవి ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన శుభ సందర్భంగా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.