అక్రమ అరెస్టులను ఖండించిన ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులను విశాఖ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని, విశాఖలో జరుగుతున్న జనసేన నాయకుల, కార్యకర్తల అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని, మా అధినేత పవన్ కళ్యాణ్ ని నిర్భందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు చవిచూడవలసి వస్తుందని తెలియజేస్తున్నామని, ఈ చర్యలను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేన శ్రేణులు ఉపేక్షించరని హెచ్చరిక చేస్తున్నామని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తెలిపారు.