మోసపోతున్న నిర్వాసితులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవిపట్నం మండలం, మూలపాడు గ్రామ నిర్వాసితులకు 2015లో గ్రామసభ పెట్టి రజని అలానే కుమారి అనే అధికారిని మా గ్రామంలో ఉన్న రైతుల వద్ద నుంచి మా భూములకు సంబంధించిన ఆధారాలన్ని తీసుకుని వెళ్లి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది అయితే అధికారులు వారి ఇచ్చిన నోటీసు ప్రకారం పోలవరం ఇరిగేషన్ ప్రాజక్ట్ నిర్మాణం వలన ముంపునకు గురైనా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గల తోయ్యేరు గ్రామంలో భూసేకరణ చేయుటకుగాను ఈ దిగువ తెలిపిన అసైన్డ్/జీరాయితి భూములకు నష్టపరిహారాన్ని చెల్లించు విషయమై గతంలో 11.07.2023వ తేదీన దేవిపట్నం తహశీల్దార్, దేవిపట్నం ఇందుకూరుపేట వారి కార్యాలయం వద్ద అవార్డు ఎంక్వయిరి నిర్వహించబడినది. సదరు అవార్డు ఎంక్వయిరి సమయం నందు ఈ క్రింద తెలిపిన భూయజమానులు ఏవిధమైన రికార్డ్ సమర్పించలేదు దానివలన 07.10.2023వ తేదీన రాజమండ్రి, ధవళేశ్వరం, పోలవరం ఇరిగేషన్ ప్రాజక్ట్ ఎల్.ఎం.సి యూనిట్ వద్దకి ఆధారాలు పట్టుకుని రావాలని లేదా భూసేకరణ చట్టం 30/2013లోని సెక్షన్77(2) సదరు నష్టపరిహారం సొమ్ములను భూసేకరణ ఆర్ అండ్ ఆర్ అథారిటీ విశాఖపట్నం వారికి జమచేయుటకు చర్య తీసుకొనుబడును అని ఇచ్చి యున్నారు అయితే ప్రధానంగా అధికారులు ఈ ఎంక్వయిరి ఇంతకు ముందు రెండు సార్లు పెట్టారు. కానీ రైతులకు గ్రామస్థులకు కనీస సమాచారం ఇవ్వకుండా సంతకాలు తీసుకుని ఆధారాలు తీసుకుంటు మోసం చేసే రీతిలో వ్యవహరించారు. ప్రశ్నించగా భూమికి భూమి వస్తుంది నష్టపరిహారం రాదని చెప్పగా నష్టపరిహారం కొరకే మా ఆధారాలు అందించం భూమి అయితే మాకు వద్దు అని ఎవరి ఆధారాలు వారు వెనక్కి తీసుకొని దీనిపై అధికారులకు రాతపూర్వకంగా కూడా ఇవ్వటం జరిగింది కానీ అధికారులు మాత్రం ఎటువంటి న్యాయం చేసే చర్య తీసుకోలేదు కదా నెల రెండు నెలలు సమయం తీసుకుని మళ్ళీ అలానే గ్రామసభ పేరుతో భూమికి భూమి వస్తుందని చెప్పగా మాకు భూమికి నష్టపరిహారం చెల్లించాలని అంతే కాని ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించగా సమాధానం లేకుండా వెళ్లిపోయారు. 11.07.2023 వ తేదీన జరిగిన మీటింగులో కూడా వచ్చిన అధికారిని వారికి అడగగా కొత్త జి.ఓ వచ్చింది మీకు భూమికి భూమి వస్తుందని చెప్తున్నారని ఇదే దేవిపట్నం పంచాయితీలో మూలపాడు, మంటూరు, మడిపల్లి, పెనికేలపాడు, ఏనుగులగుడెం, గానుగులగొంది. అంటూ చాలా గ్రామాలకు నష్ట పరిహారంని చెల్లించారు. ఇప్పుడేమో కొత్త జీ.ఓ వచ్చిందని అని చెప్తూ మీరే నష్టపోతారు అని కొంతమంది అధికారులు బలవంతం చెయ్యటం లేదా బెదిరించడం చేస్తున్నారు. గ్రామసభల్లో రోజుకొక రూల్ చూపిస్తూ మమ్మల్ని ఏమార్చే దిశగా అధికారులు ప్రవర్తిస్తున్నారు స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి వారు పేరుమీద ఒకటి చెప్తారు. ఎల్.ఎం.సి వారు ఒకటి చెప్తారు మండల తహసీల్దార్ వారి ఒకటి చెప్తారు. కానీ మోసపోయేది మాత్రం నిర్వాసితులు మాత్రమే 07.10.2023 న దేవిపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు రైతులతో ధవళేశ్వరం ఎల్ఎంసి ఆఫీస్ కు వెళ్లగా మళ్ళీ భూమికి భూమి ఇస్తారు నష్టపరిహారం రాదు అని చెప్పటం గమనార్హం. సదరు అధికారులని ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించి మళ్ళీ లిఖిత పూర్వాఖంగా మా భూములకు నష్టపరిహారం అందించమని ఇంతకు ముందు ఇచ్చి వినతి పత్రాలు జోడించి న్యాయం చేయాలని దీనిపై జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు.