ఢిల్లీలో ఒకే రోజు 104 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల ఉదృతి కొనసాగుతుంది. గురువారం ఒక్కరోజే 104 మంది చనిపోయినట్లు ఢిల్లీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఒకేరోజు 100కు పైగా కరోనా మరణాలు సంభవించలేదు. ఈ ఏడాది జూన్ 16న 93 మంది కరోనాతో మృతి చెందారు. ఆ తర్వాత మళ్లీ ఆ సంఖ్యను అధిగమించడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో కొత్తగా 7,053 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4,67,028కి చేరింది. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో 7 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.