గోకవరంలో “మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం”

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ SrI పాTamశెట్టి సూర్య చంద్ర పిలుపు మేరకు
గోకవరం మండలం జనసేన యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం’ అనే నినాదంతో గోకవరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జీవిత చరిత్రను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల జనసేన పార్టీ యువత, నాయకులు పాల్గొన్నారు.