టీచర్ పోస్టుల భర్తీలో గిరిజన నిరుద్యోగులకు అన్యాయం!: మాదాల శ్రీరాములు

  • గిరిజన ప్రాంతం గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయులుగా గిరిజననేతరులకు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసం
  • రాజ్యాంగమును మారుస్తున్న వైసిపి రాష్ట్ర ప్రభుత్వము
  • గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు దీనిమీద మీ వైఖరి బహిర్గతం చేయండి
  • జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిమాండ్!!

అరకు వ్యాలీ నియోజకవర్గం: అరకు వ్యాలీ మండల కేంద్రంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెంటల్ స్కూల్ నందు ఉపాధ్యాయులుగా గిరిజనేతరులను నియమించడం జరిగింది. ఈ పోస్టులను రద్దు చేసి ఆ పొస్టులలో గిరిజనులను నియమించాలని జనసేన ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం సుమారు 600 పోస్టులకు పాడేరు డివిజన్లో సుమారు 290 ఉపాధ్యాయ నియామకము నవంబర్ 9న ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్న ఏకలవ్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో భర్తీ చేసిన ఉపాధ్యాయ పోస్టులలో గిరిజన నిరుద్యోగులకు అవకాశం కల్పించకుండా 90 శాతం గిరిజనేతరులకు అక్కడ ఉన్న ఎస్.ఓ స్పెషల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారి బంధువులకు, వారి అనుచరులకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, ఐటీడీఏ పాడేరు డిప్యూటీ డైరెక్టర్ ఉపాద్య పోస్టులుకట్టబెట్టారు. గిరిజన నిరుద్యోగులు అప్పులు చేసి పీజీ, బి.ఈ.డీలు విద్య అభ్యసించి ఖాళీగా ఉన్నారు. గిరిజన ప్రాంతంలోని గిరిజనులకు అవకాశం కల్పించకుండా.. గిరిజన నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో.. గిరిజనేతురులకు ప్రభుత్వ శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగమును మారుస్తున్న వైసిపి రాష్ట్ర ప్రభుత్వము. గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ అంశంపై మీ వైఖరి బహిర్గతం చేసి, గిరిజన హక్కులు చట్టాలు కాపాడి గిరిజనులకు న్యాయం చేయండి. గిరిజనేతురులకు ఏ విధంగా రాజ్యాంగాన్ని మార్చి వారికి ఉపాద్యాయ పోస్టులు కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు, వైసీపీ గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలకు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..? ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజన రాజ్యాంగం కాపాడాలి. గిరిజనేతురులకు కల్పించిన పోస్టులను తొలగించి, గిరిజన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేడం జరిగింది. గిరిజనులకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ నుండి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారికి, గౌరవనీయులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి, గౌరవనీయులు గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలకు గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది.