సత్తుపల్లి నియోజకవర్గంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

సత్తుపల్లి, జనసేన పార్టీ 11 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్ జండా ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్ సూరిశెట్టి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జబీర్ సయ్యద్, సత్తుపల్లి మండల అధ్యక్షులు సింగపోగు అప్పారావు, సత్తుపల్లి మండల సెక్రటరీలు ఎండి సైఫ్, నాగబాబు, వలపుల కల్లూరు మండల అద్యక్షులు సంగీతం సాయిచందు, నాయకులు కంచర్ల గోపాలరావు, మహేష్, శ్రీను, తుంగ వెంకటేశ్వరరావు, యండి. అమన్ తదితరులు పాల్గొన్నారు.