అట్లపాడు గ్రామంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, అట్లపాడు గ్రామంలో అదివారం మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం నాయుడు(పివిఆర్) ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా అట్లపాడు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ కూల్చివేతలతో మొదలైన వైసీపీ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు కూల్చివేస్తారని, అంతేకాకుండా రాష్ట్రంలో త్వరలోనే ప్రజలు అందరు జనసేన పార్టీకి ఓట్లువేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తులా చినబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శిలు కాకర్ల నాని, ఉలుసు సౌజన్య, నిడదవోలు మండల వైస్ ప్రెసిడెంట్ పూర్ణ చంద్రరావు, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు మూర్తి, యడ్లపల్లి సత్తిబాబు, దిద్దే రాజు తూరా దుర్గయ్య మరియు నార్ని తాతాజీ, కస్తూరి వెంకట సుబ్బారావు, వద్దిరెడ్డి శివ గణపతిరాజు, శివ సాయి, అట్లపాడు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు నిడదవోలు నియోజకవర్గ వివిధ గ్రామాల జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.