సిల్వర్ స్క్రీన్ తో పాటు వెబ్ వరల్డ్ లో… కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తెలుగులో ‘ఆచార్య’, ‘మోసగాళ్లు’, మరియు  తమిళంలో ‘ఇండియన్ 2’, ‘హే సినామికా’ సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ లోనూ కాజల్ అగర్వాల్ కనిపించనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తుoడగా… తాజాగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాజల్ అగర్వాల్ తో ఓ హార్రర్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇక వైభవ్ – ఆనంది ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ప్రసారం అవుతుందని.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని.. త్వరలోనే ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తారని చెప్పారు వెంకట్ ప్రభు. సిల్వర్ స్క్రీన్ తో పాటుగా వెబ్ వరల్డ్ లో కూడా కాజల్ హవా చూపిస్తుందేమో చూడాలి.