అఖిల్ హార్స్ రైడింగ్ వీడియో

అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ ప్రస్తుతం భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది.

ప్రస్తుతం అఖిల్ ఖాతాలో క్రేజీ ప్రాజెక్ట్ ఉండగా, దీనికి కోసం కొద్ది రోజులుగా బాగా కష్టపడుతున్నాడు. గుర్రపు స్వారీ నేర్చుకుంటూ అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాడు. ఆ మధ్య గుర్రంపై అఖిల్ కూర్చున్న ఫొటో ఒకటి వైరల్ కాగా, ఇప్పుడు గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో నెట్టింట హల్ చేస్తుంది. ఈ వీడియోని అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోకు రోజు మొదలు చేయడానికి సరైన దారి, మార్నింగ్ రష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు.