తొండంగి మండల జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

తుని నియోజకవర్గం, బెండపూడి గ్రామంలో ఈ విజయదశమి పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మండల అధ్యక్షులు నాయుడు మరియు బెండపూడి గ్రామ గౌరవ అధ్యక్షులు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలోని జనసైనికులకు పార్టీ సేవలను అందుబాటులో ఉంచేందుకు కార్యాలయం ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బెండపూడి గ్రామ అధ్యక్షులు కోరుకొండ శివ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తుని ఐటి కన్వీనర్ మణిబాబు మండల ఉపాధ్యక్షులు కండవల్లి గణేష్ అధికార ప్రతినిధి పెదిరెడ్ల దుర్గాప్రసాద్, మండల సంయుక్త కార్యదర్శులు నాగేంద్ర, సతీష, బెండపూడి గ్రామ అధికార ప్రతినిధి గోపి, గ్రామ ట్రెజరర్ ఊట దుర్గ, గండ్రెడ్డి సత్యనారాయణ, సోమిశెట్టి దొరబాబు, సూరిబాబు, మంగో వెంకన్న, పబ్బు వాసు, అశోక్, హరీష్, శివ, సోము, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.