Ind vs Eng: ప్రారంభమైన రెండో రోజు ఆట..

చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో టీమిండియా.. ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. దానికి తోడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఓపెనర్ రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌తో అద్భుతంగా రాణించాడు. ఇక ప్రస్తుతం రెండో రోజు ఆట ప్రారంభమైంది. పంత్(33), అక్షర్(5) తో క్రీజులో ఉన్నారు. అయితే పంత్ రాణిస్తే భారత్ భారీ పరుగులు చేసే అవకాశం ఉంటుంది.