గోపిచంద్- మారుతి ‘పక్కా కమర్షియల్‌’

గోపీచంద్‌, మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి వైవిధ్యమైన ప్రచారం చేస్తున్న మారుతి తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశారు. పక్కి కమర్షియల్ అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమా కూడా కమర్షియల్ హంగులతో కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుందా లేదంటే సీరియస్‌గా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై మారుతి ఈ సినిమా చేస్తుండగా, ఇందులో నటించే నటీనటులపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.