బహిరంగ ప్రదేశాల్లో నిరవధిక నిరసనలు తగదు: సుప్రీంకోర్టు

బహిరంగ ప్రదేశాలను ధర్నాల కోసం ఆక్రమించరాదు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఏఏ కి వ్యతిరేకంగా గత ఫిబ్రవరిలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ఆందోళన పేరుతో షెహీన్‌భాగ్‌ను నిరసనకారులు ఆక్రమించారు. అయితే ఈ భారీ ధర్నాపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఈ ఉత్తర్వులిస్తూ.. పబ్లిక్ మీటింగులు, సభలు నిర్దేశిత ప్రాంతాల్లోనే జరగాలని సూచించింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ అలాంటి ప్రదర్శనలు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే జరగాలని కోర్టు వెల్లడిస్తూ.. రోడ్లను నిరవధికంగా ఆక్రమించుకోవడం తగదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యాన గల ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.