స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవాడలోనే…జగన్ సర్కార్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఈ ఏడాది కూడా విజయవాడలోనే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని అధికారుల్ని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వేడుకల్లో బాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహనను పెంచే దిశగా… సంబంధిత శాఖల ద్వారా చేపట్టిన పథకాలపై ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌ అధికారుల్ని ఆదేశించారు.

వాస్తవానికి ఈ ఏడాది స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్ని విశాఖపట్నంలో నిర్వహించాలని భావించారు. క్యాంపు కార్యాలయం కూడా తరలించాలని ప్రభుత్వం తొలుత భావించినా.. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పు.. తాజా పరిణామాలతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.