మోపిదేవి జనసేన అధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండల జనసేన అధ్వర్యంలో మోపిదేవిలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం దగ్గర ఉన్న మహాత్మ గాంధీ, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాల వద్ద జనసేన పార్టీ మోపిదేవి మండలం మరియు మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ అధ్వర్యంలో మోపిదేవి గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు పర్చూరి కేశవ అధ్యక్షతన జాతిపిత మహాత్మాగాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూల దండలు వేసి నివాళులర్పించి తరువాత మండల పరిధిలో ఉన్న గ్రామ పెద్దలతో మన దేశపు మువెన్నల జండా వందనం చెయడం జరిగింది. అనంతరం మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్వర్యంలో మండల పరిధిలో ఉన్న గ్రామ పెద్దలను సాలువ మరియు పూలతో సన్మానం చెయడం జరిగింది. అనంతరం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి గురించి వారి యొక్క పోరాట పటిమ గురించి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మండల పరిధిలో ఉన్న గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే వారితో పాటు జనసేన పార్టీ మోపిదేవి మండల కమిటీ సభ్యులు, మండల స్థాయి నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.