గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బొబ్బిలి నియోజకవర్గం: గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బొబ్బిలి జనసేన పార్టీ ఆఫీసులో బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్రం గురించి సందేశం ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.