దళిత గిరిజనుల సమస్యలను జనసేనాని దృష్టికి తెచ్చిన జనసేన నాయకులు

మంగళగిరి: ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై జనసేన పార్టీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృస్తాయి సమావేశంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఉత్తరాంధ్ర స్టాయిలో దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమస్యలను పూర్తిగా వివరించడం జరిగింది. ఐటిడిఏ నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గిరిజనులకు తాగునీరు, సాగునీరు, మౌలిక సదుపాయాలకూడా లేకుండా కొండకోనల్లో, గిరి శిఖరాల్లో గిరిజనుల అవస్థలు పడుతున్నారని, అత్యవసర ఆసుపత్రి అవసరం కలిగితే డోలియే మార్గమని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో దళితులు భూములు అధికార పార్టీ కబ్జాలు చేస్తుందని, చివరికి స్మశానాలు కూడా ఆక్యుపై చేసుకునే స్థాయికి వచ్చారని. ఉత్తరాంధ్రలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వివరించడం జరిగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వచ్చేది జనసేన ప్రభుత్వమే అని, మీ అందరి సహకారంతో రద్దయిన 27 సబ్ ప్లాన్ పథకాలు, సప్లై నిధులు సక్రమంగా చట్ట పరంగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. దళిత గిరిజన వాడల్లో ప్రజా సమస్యలపై ప్రజా పోరాటం చేస్తూ యువకుల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు మరియు జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు, పాల్గొన్నారు.