మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

గజపతినగరం నియోజకవర్గం: గజపతినగరం జనసేన నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం గజపతినగరం కేంద్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ బ్రిటీష్ దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్ర్య స్వేఛ్చా గాలులు పీలుస్తున్న నవీనభారతావని ముద్దుబిడ్డలైన భారతీయులందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, ఎందరో మహానుభావుల కలల పంట, మరెందరో అమరవీరుల త్యాగఫలం, ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలం, ఆ వీరుల త్యాగఫలం వృధా కాకుండా మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశ రక్షణకు, అభివృద్ధికి పాటుపడిన మహనీయులు అందరికీ వందనాలు తెలుపుతూ అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. త్వరలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మనందరి కళ నెరవాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు మోహన్ రావు, డా. రవి కుమార్ మిడతాన, గజపతినగరం నియోజకవర్గం నుంచి పండు, ఆదినారాయణ మహేష్, రాజీవ్, శ్రీను, హెమసుందర్, శంకర్, సంతోష్ దత్తిరజెరు లక్ష్మణ సమిరెడ్డి, చరణ్, అశోక్, సూర్య, రాంబాబు, గంట్యాడ అప్పలరాజు, రాంబాబు, బొండపల్లి గౌరీ నాయుడు, వీరమహిళలు దుర్గ, పరమేశ్వరి, శివరాత్రి, కుమారి జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.