India VS England: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

రెండో టెస్టులో టీమ్‌ ఇండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించి మ్యాచ్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆ జట్టు 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఈ క్రమంలోనే టీమ్‌ ఇండియా ఇప్పుడు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత జట్టుకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. ఈ సిరీస్‌లో నిలవాలన్నా, టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీకి అర్హత సాధించాలన్నా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి.

భారత జట్టు: రోహిత్‌, శుభ్‌మన్‌, పుజారా, కోహ్లి (కెప్టెన్‌), రహానె, పంత్‌, అశ్విన్‌, అక్షర్‌, కుల్‌దీప్‌ ఇషాంత్‌, మహ్మద్ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు: సిబ్లీ, బర్న్స్‌, లారెన్స్‌, రూట్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, పోప్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ, బ్రాడ్‌, స్టోన్‌, లీచ్‌.