లియో పార్గిల్ శిఖరాన్ని అధిరోహించిన ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎత్తయిన లియో పార్గిల్‌ పర్వతాన్ని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు బృందం అధిరోహించింది. కరోనా మహమ్మారి సమయంలో పర్వతారోహణ చేసిన తొలి బృందంగా ఐటీబీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 16 మంది సభ్యులు కలిగిన బృందంలో 12 మంది సభ్యులు విజయవంతంగా 22,222 అడుగుల ఎత్తయిన లియో పార్గిల్‌ పర్వతాన్ని అధిరోహించారు. పర్వతాధిరోహణ అనంతరం భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అలాగే జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆగస్ట్‌ 31న ఐటీబీపీ సభ్యుల బృందం షిమ్లాలోని శిఖరాన్ని అధిరోగహించగా ఐటీబీపీ ఉన్నతాధికారులు పర్వతారోహకులను అభినందించారు.

ఈ బృందంలోని హెడ్ కానిస్టేబుల్ ప్రదీప్ నేగి ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు జయించారు. అతను హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని చిట్కుల్ గ్రామానికి చెందినవాడు. అధిక ఎత్తులో ఉండటం, కఠినమైన చల్లని ప్రాంతంలో మోహరించడం వలన.. ఐటీబీపీ అత్యంత సరిపోయే సైన్యంగా పరిగణించబడుతున్నది. కొండ శిఖరాలను అధిరోహించడంలో ఇప్పటివరకు ఐటీబీపీ 213 యాత్రలను పూర్తి చేసింది. ఇది కూడా ఒక రికార్డే.