రెండుగా చీలిన ఇండోనేషియా విమానం!

రెండు రోజుల క్రితం ఇండోనేషియాలో ప్రమాదానికి గురైన విమానం నీటిని బలంగా తాకి విరిగిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు దేశ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు మార్కాహియో ఠటోమో వెల్లడించారు. విమాన శకలాలు చాలా దగ్గర దగ్గరి ప్రాంతాల్లోనే లభిస్తున్నాయని, విమానం గాల్లో పేలి ఉంటే శకలాలు చాలా దూరంగా పడివుండేవని ఆయన అన్నారు.

సెర్చ్ బృందాలకు లభించిన బ్లాక్ బాక్స్ లను విశ్లేషించాల్సి వుందని, ఆ తరువాతే విమానానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. కాగా, శ్రీవిజయ ఎయిర్ లైన్స్ కు చెందిన జెట్ విమానం, జావా సముద్రంలో కూలిపోగా, 62 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే.