శ్రీమహాలక్ష్మీగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు నేడు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్యసాహసాలు, విజయాలకు ఈ తల్లి అధిష్టాన దేవత. సకల లోకాలకు ఈమె ఐశ్వర్యప్రదాత. ఇరువైపులా గజ రాజులు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో, మహాలక్ష్మీ స్వరూపంతో ఈ తల్లి దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు లైన్లలో బారులు తీరారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు.. అమితమైన పరాక్రమంతో డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.