వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం.. ఖండించిన ఆరోగ్యశాఖ

వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.