దేవరాయపల్లి పంచాయితీలో గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: జనసేన డిమాండ్

అనంత సాగరం మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మండలం పాత దేవరాయపల్లి పంచాయితీలో ఎస్సీ 75 సంవత్సరాలు పూర్తి అయిన కొన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో చిన్న పాటి వర్షం పడినా వీధులన్నీ బురదతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో వీధులన్నీ బురదమయం అవుతుంది. ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కానీ, మండల నాయకులు గానీ గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే మేక పాటి విక్రమ్ రెడ్డి దృష్టి తీసుకొని వెళ్ళి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, సీసీ రోడ్లు మరియు సైడ్ కాలువలు వెంటనే ఏర్పాటు చేయాలని అనంత సాగరం మండల జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షాన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మండల కార్యదర్శి ఎం. పెంచలయ్య, జన సైనికులు, ఎం. చిన్నయ్య, వెంకటేష్, నరసింహు లు పాల్గొనడం జరిగింది.