ఆచంట జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలంలో జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళు ప్రోగ్రాంను ఆచంట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు పిఎసి సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుగొండలో ఉన్న పెనుగొండ మరియు మునుమర్రు, కొటాలపర్రు లేఔట్ల దగ్గరకు వెళ్లి పరిశీలించడం జరిగింది ఎక్కడ కూడా లేఅవుట్లలో కనీసం మౌళిక సదుపాయాలను కల్పించడం జరగలేదు. కొన్నిచోట్ల అయితే కనీసం ట్రాక్టర్లు వెళ్లడానికి సరిపడా రోడ్డు కూడా లేదు కేవలం అధికార పార్టీ నామమాత్రంగా మాత్రమే ఈ ఇల్లు స్థలాన్ని ఇవ్వడం జరిగిందని అవి కూడా వారికి ఒక్కొక్కరు స్థలానికి 70000 చెల్లించడం జరిగిందని చెప్తున్నారు ఈ విధంగా జగనన్న వారిని మోసం చేయడం జరిగిందని అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. నియోజవర్గ ఇన్చార్జ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వారు స్వలాభాల కోసం 40 లక్షల విలువ చేసే భూములను 70 లక్షలకు కొన్నామని చెబుతూ అర్హులైన వారి దగ్గర ఈ విధంగా 70000 తీసుకోవడం ఎంతవరకు న్యాయమని కనీసం వారికి మౌళిక సదుపాయాలను కూడా కల్పించడం లేదని ఇసుక ట్రాక్టర్లు తిరగడానికి రోడ్లు కూడా లేవని ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టే మోసం చేస్తున్నారని తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు మత్తు నిద్ర వదిలి పనిచేయాలని ఆరోపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజవర్గం ఇంచార్జ్ మరియు పిఎసి సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్ మరియు మండల అధ్యక్షులు కంబాల బాబులు మండల టౌన్ ప్రెసిడెంట్ బాబురావు, మునమర్రు మండల కమిటీ సభ్యులు నరసింహమూర్తి, కొటాలపారు గ్రామ అధ్యక్షుడు ఆకుల సుబ్బారావు, ఆకుల ప్రసాదు, మరియు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ కొండవీటి శ్రీనివాస్, తోట సురేంద్ర మరియు మండల కమిటీ సభ్యులు మంద నవీన్, దార్లంక మారుతి జనసేన వీర మహిళ బొరుసు కళ్యాణి మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.